fbpx
Menu Close

ఆనపకాయ పెసరపప్పు కూర

ఆనపకాయ పెసరపప్పు కూర

కావలసిన పదార్థాలు:ఆనపకాయ-ఒకటి(సన్నగా తరిగి పక్కన పెట్టాలి)పెసరపప్పు-ఒక కప్పు(అరగంటసేపునానబెట్టుకోవాలి)ఉప్పు-తగినంతపచ్చిమిర్చి-ఒకటిజీలకర్ర-పావుస్పూన్ఆవాలు-పావుస్పూన్ఇంగువ-కొంచెంఆయిల్-ఒకస్పూన్కరివేపాకు-ఒకరెమ్మతయారీ పద్దతి:ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలితరువాత స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.అందులోఒక స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాకఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి వేయించి పెసర పప్పువేసి కలపాలి.కొంచెంనీరు పోసి కలిపి మూతపెట్టాలి.అయిదునిమిషాల తరువాత మూత తీసి కలిపి అందులో ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలువేసి  కలపాలి.తగినంతఉప్పు కొద్దిగావేసి కలపాలి .ఆనపకాయ పెసరపప్పుపొడి కూర తయారు.యిది వేడి వేడి అన్నం లోకి  బాగుంటుంది .