2583. Sri Subrahmanya Bhujanga Stotram with Meaning | శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం- తాత్పర్యం

2583. Sri Subrahmanya Bhujanga Stotram with Meaning

Sri Subrahmanya Bhujanga Stotram with Meaning
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం – తాత్పర్యం

Sri Subrahmanya Bhujanga Stotram (శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం) is a powerful 33-verse hymn composed by Sri Adi Shankaracharya in praise of Lord Subrahmanya (Kartikeya / Murugan) at Tiruchendur. The Subrahmanya Bhujanga Stotram is Written in the rhythmic Bhujanga Prayata meter (resembling the graceful movement of a serpent), this sacred hymn grants protection from illnesses, removes fears and obstacles, and bestows health, prosperity, and ultimate spiritual liberation (Sayujya).

జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారిచే విరచితమైన అత్యంత శక్తివంతమైన స్తోత్రం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ‘భుజంగ’ వృత్తంలో సాగే ఈ 33 శ్లోకాల స్తోత్రం సకల రోగాలను, భయాలను, పాపాలను హరించి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు స్కంద సాయుజ్య ముక్తిని ప్రసాదిస్తుంది.

🌺 Sri Subrahmanya Bhujanga Stotram Slokas & Meaning (శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం శ్లోకాలు – తాత్పర్యం)

Sloka 1

సదా బాలరూపాపి విఘ్నాద్రిహన్త్రీ – మహాదన్తివక్త్రాపి పంచాస్య మాన్యా |

విధ్రీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే – విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తిః ॥ 1 ॥

  • భావం: ఎల్లప్పుడు బాల రూపమున ఉన్నను విఘ్న పర్వతములను భేదించునదియు, గొప్ప గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము – శివుడు) ఆదర పాత్రమును, బ్రహ్మ, ఇంద్రుడు మున్నగు వారిచే వెతుకదగినదియు, గణేశుడను పేరుగల ఒకానొక మంగళరూపము నాకు సంపదను కలుగజేయు గాక!

Sloka 2

నజానామి శబ్దం నజానామి చార్థం – నజానామి పద్యం నజానామి గద్యమ్ |

చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – ముఖా న్నిస్సరన్తే గిరశ్చాపి చిత్రమ్ ॥ 2 ॥

  • భావం: నేను శబ్దము నెరుగను, అర్థము నెరుగను, పద్యము నెరుగను, గద్యము నెరుగను. ఆరు ముఖములు గల ఒకానొక చిద్రూపము నా హృదయమునందు ప్రకాశించుచున్నది. దాని ప్రభావమువలన నా నోటినుండి చిత్రముగా ఈ మాటలు (శ్లోకములు) వెలువడుచున్నవి.

Sloka 3

మయూరాధిరూఢం మహావాక్యగూఢం – మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |

మహీదేవదేవం మహావేదభావం – మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥ 3 ॥

  • భావం: నెమలిని అధిరోహించినవాడును, వేదాంత మహావాక్యములలో నిగూఢముగా ఉన్నవాడును, మనోహరమైన దేహము గలవాడును, మహాత్ముల చిత్తమున నివసించువాడును, బ్రాహ్మణుల ఆరాధ్యుడైన దేవుడును, వేదముల పరమార్థమును, మహాదేవుని కుమారుడును, లోకపాలకుడునైన సుబ్రహ్మణ్యేశ్వరుని సేవించుచున్నాను.

Sloka 4

యదా సన్నిధానం గతా మానవా మే – భవాంబోధి పారం గతాస్తే తదైవ |

ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే – తమిడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ ॥ 4 ॥

  • భావం: “నా సాన్నిధ్యమును పొందిన వెంటనే మనుజులు సంసార సాగరమును దాటుదురు” అని సూచించుచూ సముద్ర తీరమున వేంచేసియున్న, పరాదేవత యొక్క పుత్రుడగు పవిత్రుడైన సుబ్రహ్మణ్యుని స్తుతించుచున్నాను.

Sloka 5

యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా – స్తథైవాపదస్సన్నిధౌ సేవతాం మే |

ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం – సదా భావయే హృత్సరోజే గుహం తమ్ ॥ 5 ॥

  • భావం: “ఎగసిపడే సముద్ర తరంగములు ఒడ్డును చేరి లయమగునట్లుగా, నా సన్నిధానమున సేవించు జనుల ఆపదలు నశించిపోవును” అని మానవులకు చూపించుచున్నట్లున్న ఆ కార్తికేయుని నా హృదయపద్మమునందు సదా ధ్యానింతును.

Sloka 6

గిరౌ మన్నివాసే నరా యేధిరూఢా – స్తదా పర్వతే రాజతే తేధిరూఢాః |

ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢ – స్సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు ॥ 6 ॥

  • భావం: “నా నివాస స్థానమగు పర్వతము నెక్కిన మనుష్యులు కైలాసము నధిష్టించగలరు” అని చెప్పుచున్నట్లుగా గంధశైలముపై వేంచేసియున్న ఆ షణ్ముఖ దేవుడు ఎల్లప్పుడూ నాకు సంతోషము కలిగించుగాక!

Sloka 7

మహాంబోధి తీరే మహాపాపచోరే – మునీంద్రానుకూలే సుగంధాఖ్య శైలే |

గుహాయాం వసంతం స్వభాసా లసంతం – జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ ॥ 7 ॥

  • భావం: మహా సముద్రతీరమందున్నదీ, మహా పాపములను హరించునదీ, మునీంద్రులకు నివాసమైనదీ అగు గంధశైలమునందలి గుహయందు స్వయం ప్రకాశముతో విరాజిల్లుచూ జనుల బాధలను హరించు కుమారస్వామిని ఆశ్రయించుచున్నాను.

Sloka 8

లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే – సుమస్తోమ సంఛన్నమాణిక్య మంచే |

సముద్యత్సహస్రార్క తుల్యప్రకాశం – సదా భావయే కార్తికేయం సురేశమ్ ॥ 8 ॥

  • భావం: మనుష్యుల కోరికలను నెరవేర్చు బంగారు భవనమునందు, పుష్పములచే కప్పబడిన రత్నపీఠముపై ఉదయించు సహస్రాదిత్యుల ప్రకాశముతో విరాజిల్లు దేవతాశ్రేష్ఠుడైన కుమారస్వామిని నిరంతరం ధ్యానింతును.

Sloka 9

రణద్ధంసకే మంజులేత్యంతశోణే – మనోహారి లావణ్య పీయూషపూర్ణే |

మనష్షట్పదో మే భవక్లేశ తప్తః – సదా మోదతాం స్కంద తే పాదపద్మే ॥ 9 ॥

  • భావం: ఓ కుమారస్వామీ! సంసార కష్టములచే తపింపబడిన నా మనస్సనెడి తుమ్మెద – శబ్దించుచున్న అందెలతో మనోహరమై, లావణ్యామృతముతో నిండియున్న నీ ఎఱ్ఱని పాదపద్మము నందు నిరంతరము ఆనందించుగాక!

Sloka 10

సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం – క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ |

లసద్ధేమపట్టేన విద్యోతమానాం – కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ ॥ 10 ॥

  • భావం: ఓ కుమారస్వామీ! సువర్ణ కాంతిగల దివ్య వస్త్రములతోను, మ్రోగుచున్న చిరుగంటల మొలనూలుతోను, ప్రకాశించుచున్న పసిడి పట్టెతోను విరాజిల్లు నీ నడుము (కటి) ప్రదేశమును ధ్యానించుచున్నాను.

Sloka 11

పులిందేశకన్యా ఘనాభోగతుంగ – స్తనాలింగనాసక్త కాశ్మీర రాగమ్ |

నమస్యామ్యహం తారకారే తవోర – స్వభక్తావనే సర్వదా సానురాగమ్ ॥ 11 ॥

  • భావం: తారకాసుర సంహారీ! పుళింద కన్యయైన వల్లీదేవి యొక్క ఆలింగనముచే కుంకుమ పూతతో ఎఱ్ఱనైనదియు, నిజ భక్తుల రక్షణ యందు ఎల్లప్పుడూ ఆసక్తి గలిగిన నీ వక్షస్థలమునకు నమస్కరించుచున్నాను.

Sloka 12

విధౌ క్లృప్తదండాన్స్వలీలా ధృతాండాన్ – నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |

హతేంద్రారిషండాన్ జగత్రాణశౌండాన్ – సదా తే ప్రచండాంశ్రయే బాహుదండాన్ ॥ 12 ॥

  • భావం: బ్రహ్మదేవుని సహితం దండించునవి, లీలగా బ్రహ్మాండమును మోయునవి, ఏనుగు తొండముల కంటే బలమైనవి, శత్రువులకు యమదండములైనవి, రాక్షస సమూహమును సంహరించునవి, లోకములను రక్షించునవియు అగు నీ ప్రచండ బాహుదండములను (చేతులను) ఎల్లప్పుడూ ఆశ్రయించుచున్నాను.

Sloka 13

సదా శారదా షణ్మృగాంకా యది స్యుః – సముద్యంత ఏవస్థితాశ్చేత్సమంతాత్ |

సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనా – స్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ ॥ 13 ॥

  • భావం: ఓ కుమారస్వామీ! ఆరు శరచ్చంద్రులు ఒకేసారి ఉదయించి, ఎల్లప్పుడూ పూర్ణబింబములతో, కళంకము లేకుండా వెలుగుతుంటే మాత్రమే నీ ఆరు ముఖములతో వాటిని పోల్చవచ్చును.

Sloka 14

స్ఫురన్మందహాసైస్సహంసాని చంచ – త్కటాక్షావలీ భృంగ సంఘోజ్జ్వలాని |

సుధాస్యంది బింబాధరాణీశసూనో – తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి ॥ 14 ॥

  • భావం: ఓ శివకుమారా! చిరునవ్వులనెడి హంసలతో, చంచల కటాక్షములనెడి తుమ్మెదల గుంపులతో, అమృతమును కురిపించు దొండపండు వంటి పెదవులతో విరాజిల్లు నీ ఆరు ముఖ పద్మములను దర్శించుచున్నాను.

Sloka 15

విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం – దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |

మయీషత్కటాక్షస్సకృత్పాతితశ్చే – ద్భవేత్తే దయాశీల కా నామ హానిః ॥ 15 ॥

  • భావం: దయాశీలుడా! విశాలమై, చెవుల వరకు సాగిన నీ పన్నెండు నేత్రముల నుండి నిరంతరం దయ వర్షిస్తుండగా, నీ కడకంటి చూపును ఒక్కసారి నాపై ప్రసరింపజేసిన నీకు వచ్చు హాని ఏమున్నది?

Sloka 16

సుతాంగోద్భవో మేఽసి జీవేతి షడ్ధా – జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |

జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః – కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః ॥ 16 ॥

  • భావం: “కుమారా! చిరంజీవివి కమ్ము” అని ఆరుసార్లు జపిస్తూ పరమశివుడు ఆనందంతో ముద్దాడే, జగత్తు యొక్క భారమును మోసే, రత్న కిరీటములతో ప్రకాశించే నీ ఆరు శిరస్సులకు ఓ జగన్నాథా! నమస్కారము.

Sloka 17

స్ఫురద్రత్న కేయూర హారాభిరామ – శ్చలత్కుండల శ్రీలసద్గండభాగః |

కటౌ పీతవాసాః కరే చారుశక్తిః – పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః ॥ 17 ॥

  • భావం: రత్న కంకణములు, హారములతో మనోహరుడై, కదిలే కుండలముల కాంతితో ప్రకాశించు చెక్కిళ్ళు కలిగి, పీతాంబరమును ధరించి, చేతిలో శక్తి ఆయుధమును ధరించిన శివనందనుడైన కుమారస్వామి నా ఎదుట సాక్షాత్కరించుగాక!

Sloka 18

ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యా – హ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |

సముత్పత్య తాతం శ్రయంతం కుమారం – హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ ॥ 18 ॥

  • భావం: “నాయనా! ఇటు రమ్ము” అని చేతులు చాచి ఆదరముతో శంకరుడు పిలువగా, పార్వతీదేవి ఒడి నుండి గంతువేసి తండ్రిని కౌగిలించుకున్న బాలసుబ్రహ్మణ్య మూర్తిని సేవించుచున్నాను.

Sloka 19

కుమారేశసూనో గుహ స్కంద సేనా – పతే శక్తిపాణే మయూరాధిరూఢ |

పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ – ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ ॥ 19 ॥

  • భావం: ఓ కుమారస్వామీ! ఈశ్వర పుత్రా! గుహా! స్కందా! దేవసేనాపతీ! శక్తి ఆయుధధారీ! నెమలి వాహనా! వల్లీనాథా! భక్తార్తిహారీ! తారకాసుర సంహారీ! ప్రభో! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

Sloka 20

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే – కఫోద్గారివక్త్రే భయోత్కంపి గాత్రే |

ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం – ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ ॥ 20 ॥

  • భావం: నా ఇంద్రియములు నశించి, స్పృహ తప్పి, చేష్టలు ఉడిగి, నోటి నుండి కఫము ఊరుచుండగా, భయముతో ఒళ్ళు కంపించుచూ అంత్యకాలమున నేను ప్రాణప్రయాణమునకు సిద్ధమైనప్పుడు, దయామయా గుహా! నీవు శీఘ్రముగా నా యెదుట ప్రత్యక్షము కమ్ము!

Sloka 21

కృతాంతస్య దూతేషు చండేషు కోపా – ద్దహచ్ఛింది భింధీతి మాం తర్జయత్సు |

మయూరం సమారుహ్య మాభైరితి త్వం – పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ ॥ 21 ॥

  • భావం: భయంకరులైన యమదూతలు కోపంతో “కాల్చండి, నరకండి” అని బెదిరించునప్పుడు, నీవు చేతిలో శక్తి ఆయుధమును పట్టుకుని నెమలిపై వచ్చి “భయపడకుము” అని అభయమిస్తూ నా యెదుట ప్రత్యక్షము కమ్ము!

Sloka 22

ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా – ప్రసాద్య ప్రభో ప్రార్థయేనేకవారమ్ |

న వక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే – న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా ॥ 22 ॥

  • భావం: కృపాసముద్రుడా! నీ పాదములపై పడి అనేకసార్లు ప్రార్థించుచున్నాను. మరణ సమయమున నేను మాట్లాడలేను. కావున ఆ అంత్యకాలమున నన్ను ఎంతమాత్రము ఉపేక్షించవద్దు!

Sloka 23

సహస్రాండభోక్తా త్వయా శూరనామా – హతస్తారకస్సింహవక్త్రశ్చ దైత్యః |

మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం – నహంసి ప్రభో కింకరోమి క్వ యామి ॥ 23 ॥

  • భావం: ప్రభో! అనేక బ్రహ్మాండములను ఏలిన శూరపద్ముడు, తారకాసురుడు, సింహముఖుడు అనే రాక్షసులనే సంహరించిన నీవు, నా హృదయములోని ఒకే ఒక మనోవ్యధను ఏల నశింపజేయవు? నేనేమి చేయుదును? ఎక్కడకు పోవుదును?

Sloka 24

అహం సర్వదా దుఃఖభారావసన్నో – భవాన్ దీనబంధుస్త్వదన్యం న యాచే |

భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం – మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ ॥ 24 ॥

  • భావం: పార్వతీ నందనా! నేను దుఃఖ భారంతో క్రుంగిపోతున్నాను. నీవు దీనబంధువువు. నిన్ను తప్ప అన్యులను వేడను. నీ భక్తికి ఆటంకము కలిగిస్తూ ఎల్లప్పుడూ బాధించే నా మానసిక వ్యధను వెంటనే నశింపజేయుము.

Sloka 25

అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహ – జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః |

పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం – విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే ॥ 25 ॥

  • భావం: ఓ తారకాసుర సంహారీ! మూర్ఛ రోగము (అపస్మారము), కుష్టు, క్షయ, మూలవ్యాధి, ప్రమేహము, జ్వరం, పిచ్చి, గుల్మ రోగములు మొదలైన మహారోగములు మరియు పిశాచములు – నీ ఆలయ పత్ర విభూతిని (ఆకులలో ఇచ్చే ప్రసాద విభూతి) చూసిన క్షణములోనే పటాపంచలై పారిపోవును.

Sloka 26

దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తి – ర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |

కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం – గుహే సంతు లీనా మమాశేషభావాః ॥ 26 ॥

  • భావం: నా కన్నులలో కుమారస్వామి దివ్య రూపము, చెవులలో ఆయన కీర్తి, నోటి యందు పవిత్రమైన ఆయన చరిత్ర, చేతులలో ఆయన పూజ, శరీరము ఆయనకు దాస్యము చేస్తూ నా సమస్త భావములు ఆ గుహుని యందే లీనమగుగాక!

Sloka 27

మునీనాముతాహో నృణాం భక్తిభాజా – మభీష్టప్రదాస్సంతి సర్వత్ర దేవాః |

నృణామంత్యజానామపి స్వార్థదానే – గుహాద్దేవమన్యం నజానే నజానే ॥ 27 ॥

  • భావం: మునులకు, భక్తిపరులకు కోరికలు తీర్చే దేవతలు అంతటా ఉన్నారు. కానీ కడపటి వర్ణములలో జన్మించిన వారికి సైతం కోరిన కోరికలు తీర్చుటలో గుహునికంటే వేరొక దైవమును నేనెరుంగను, నేనెరుంగను!

Sloka 28

కలత్రం సుతా బంధువర్గః పశుర్వా – నరో వా థ నారీ గృహే యే మదీయాః |

యజంతో నమంతస్స్తువంతో భవంతం – స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార ॥ 28 ॥

  • భావం: ఓ కుమారస్వామీ! నా భార్య, పిల్లలు, బంధువులు, పశువులు, నా యింటిలోని స్త్రీ పురుషులందరూ నిన్ను పూజించువారుగా, నమస్కరించువారుగా, స్తుతించువారుగా మరియు నిరంతరం స్మరించువారుగా ఉందురు గాక!

Sloka 29

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టా – స్తథా వ్యాధయో బాధకా యే మదంగే |

భవచ్ఛక్తి తీక్ష్ణాగ్రభిన్నాస్సుదూరే – వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల ॥ 29 ॥

  • భావం: క్రౌంచ పర్వతమును పిండి చేసిన కుమారస్వామీ! నా శరీరమును బాధించే దుష్ట మృగములు, పక్షులు, కీటకములు మరియు వ్యాధులు – నీ శక్తి ఆయుధము యొక్క వాడియైన కొనచే భేదింపబడి దూరముగా నశించిపోవుగాక!

Sloka 30

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం – సహేతే న కిం దేవసేనాధినాథ |

అహం చాతిబాలో భవాన్ లోకతాతః – క్షమస్వాపరాధం సమస్తం మహేశ ॥ 30 ॥

  • భావం: దేవసేనాపతీ! తల్లిదండ్రులు తమ పిల్లల అపరాధములను క్షమించరా? నేను అజ్ఞానము గల చిన్న పిల్లాడను, నీవు లోకములకే తండ్రివి. కావున నా సమస్త అపరాధములను క్షమించుము!

Sloka 31

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం – నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |

నమస్సింధవే సింధుదేశాయ తుభ్యం – పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు ॥ 31 ॥

  • భావం: కుమారస్వామీ! నీ వాహనమైన నెమలికి, నీ శక్తి ఆయుధమునకు, నీ మేకపోతునకు, నీ ధ్వజమైన కోడిపుంజునకు నమస్కారము. నీవు వేంచేసియున్న సముద్రమునకు, తిరుచెందూర్ క్షేత్రమునకు నమస్కారము. ఓ స్కందమూర్తీ! నీకు మరల మరల నమస్కరించుచున్నాను.

Sloka 32

జయానందభూమన్ జయాపారధామ – జయామోఘకీర్తే జయానందమూర్తే |

జయానందసింధో జయాశేషబంధో – జయ త్వం సదా ముక్తిదానేశసూనో ॥ 32 ॥

  • భావం: ఆనందస్వరూపుడా! అపార తేజోమయుడా! అమోఘ కీర్తిమంతుడా! ఆనంద సముద్రుడా! అందరికీ బంధువైనవాడా! ముక్తిని ప్రసాదించే ఈశ్వర కుమారా! నీకు జయము, జయము!

Sloka 33 (Phalastuti – ఫలశృతి)

భుజంగాఖ్య వృత్తేన క్లృప్తం స్తవం యః – పఠేద్భక్తి యుక్తో గుహం సంప్రణమ్య |

స పుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయు – ర్లభేత్స్కంద సాయుజ్య మంతే నరస్సః ॥ 33 ॥

  • భావం: ఎవరైతే భక్తితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రణమిల్లి భుజంగ వృత్తములో నిర్మించబడిన ఈ శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ ను పఠిస్తారో, వారు సత్సంతానమును, మంచి భార్యను, ధనమును, దీర్ఘాయుష్షును పొంది, అంత్యకాలమున స్కంద సాయుజ్య ముక్తిని పొందుదురు.

॥ శ్రీ శంకర భగవత్పాద కృత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్ సంపూర్ణమ్ ॥

💡 Spiritual Significance & Benefits of Chanting

  • Healing & Health: Reciting Verse 25 helps cure severe ailments, skin diseases, mental turmoil, and negative energies.

  • Fearlessness at End of Life: Verses 20, 21, and 22 provide supreme spiritual comfort and liberation from the fear of death.

  • Family Harmony & Prosperity: Regular chanting brings marital bliss, virtuous progeny, wealth, and long life (Phalastuti – Sloka 33).

❓ Frequently Asked Questions (FAQ)

Q1. Who composed the Sri Subrahmanya Bhujanga Stotram?

A: Sri Subrahmanya Bhujanga Stotram was composed by Sri Adi Shankaracharya at the holy seaside shrine of Tiruchendur in Tamil Nadu.

Q2. What makes the Bhujanga meter special?

A: ‘Bhujanga’ refers to a serpent. The poetic Bhujanga meter flows gracefully like a moving snake, creating a rhythmic and uplifting devotional vibration when chanted. The Sri Subrahmanya Bhujanga Stotram is one of the great chanting in that Bhujanga meter

🤝 Support Our Channel & Website

Your support helps us share authentic spiritual literature and Vedic chants freely:

More Subrahmanya Stotrams like శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్
2574. Sri Shanmukha Dandakam | శ్రీ షణ్ముఖ దండకం

2573. Sri Karthikeya Ashtakam | శ్రీ కార్తికేయాష్టకం


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply