fbpx
Menu Close

ఆనపకాయ ముక్కల పులుసు

కావలసిన పదార్దాలు :
ఆనపకాయ – సగం ముక్క (తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )
వంకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )
బెండకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )
పచ్చిమిర్చి –ఒకటి (సన్నగా నిలువుగా తరగాలి )
బెల్లం –నిమ్మకాయంత
చింత పండు –నిమ్మకాయంత (నీటిలో నాన బెట్టి రంసంతీసి వుంచాలి )
సెనగపిండి -రెండు స్పూన్స్ (కొంచెం నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )
ఆవాలు -ఆఫ్ స్పూన్
మెంతులు -ఆఫ్ స్పూన్
జీలకర్ర -ఆఫ్ స్పూన్
ఎండు మిర్చి –ఒకటి (చిన్న ముక్కలుగా కట్ చేయాలి )
ఆయిల్ -ఒక స్పూన్
కొత్తిమీర –కొంచెం
ఉప్పు –సరిపడ
తయారి పద్దతి :ఒక గిన్నెలో చింత పండు రసం పోసి, ముక్కలు వేసి ,బెల్లం వేసి ,పచ్చి మిర్చి వేసి ,కొత్తిమీర వేసి మరగనివ్వాలి .ముక్కలు మెత్త గ ఉడికాక సెనగపిండి పోసి మరగ నివ్వాలి .వేరే కడాయిలో నూనె వేసి ఆవాలు ,మెంతులు వేసి ,జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేగాక మరిగిన పులుసులో వేసి స్టవ్ ఆఫ్ చేయాలి .ఆనపకాయ ముక్కల పులుసు రెడి .
సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .దీనికి సైడ్ డిష్ గ కంది పప్పు ,కంది పొడి ,కందిపప్పు పచ్చడి బాగుంటాయి .

Discover more from Speaking Data

Subscribe to get the latest posts to your email.

Leave a Reply