fbpx
Menu Close

టొమేటో రైస్

కావలసిన పదార్థాలు :

బాసుమతి బియ్యం – అరకిలో
టొమేటోలు -పావుకిలో
కొబ్బరి కోరు – 1 కప్పుడు
పచ్చి మిర్చి- 8
అల్లం -చిన్న ముక్క
ఉల్లి పాయలు -4
ఎడు మిరపకాయలు -10
లవంగాలు – 1 టీ స్పూను
దాల్చిన చెక్క – కొద్దిగా
డాల్డా – 200 గ్రాములు
మెంథాల్ – 10 గ్రాములు
ఉప్పు –తగినంత

తయారీ పద్దతి :బియ్యం కడిగి ఉంచుకోవాలి. బాణలిలో ఎండుమిర్చి, అల్లం, టొమేటోలు, కొబ్బరి కోరు నూనె లేకుండా వేయించుకుని ముద్దలా రుబ్బుకోవాలి. డాల్డావేసి కాగాక, మసాలాలన్నీ వేసి, అవి వేగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తరువాత కడిగి ఉంచిన బియ్యం వేసి వేయించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న ముద్ద వేసి ఒకటికి రెండు కొలతలు చొప్పున నీళ్ళు పోసి, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, ఘుమఘుమలాడే టొమేటో రైస్ సిద్ధం.


Discover more from Speaking Data

Subscribe to get the latest posts to your email.

Leave a Reply