రక్తపోటును అదుపులో పెట్టే అరటి మామిడి ఇగురు

కావలసిన పదార్థాలు :
అరటికాయలు… మూడు
పచ్చిమామిడి… రెండు
ఉల్లిపాయ… ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్… ఒక టీ.
పోపు దినుసులు… అర టీ.
మిర్చి పొడి… రెండు టీ.
ధనియాల పొడి… అర టీ.
గరంమసాలా… పావు టీ.
పచ్చిమిర్చి తరుగు… పది
పసుపు… అర టీ.
కొత్తిమీర… 2 కట్టలు కరివేపాకు… 2 రెమ్మలు
రిఫైండ్ ఆయిల్… సరిపడా
తయారీ విధానం :
ముందుగా అరటికాయను కొద్ది సేపు వేడి నీళ్ళలో ఉడికించి, పైతోలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
కడాయిలో నూనె వేసి, వేడి చేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించి ఆ తరువాత… ఉల్లి పాయలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి.
అరటికాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిర్చిపొడి, ఉప్పు, ధనియాల పొడి, మామిడి ముక్కలు వేసి ఐదు నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించి ఒక గ్లాసు నీళ్ళు పోయాలి.
నీళ్ళు చిక్కబడ్డాక గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వరసగా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఇది వేడి వేడి అన్నంతో తింటే బాగుంటుంది. అరటిలో లభించే పొటాషియంవల్ల… రక్తపోటు, అధిక ఒత్తిడిని తగ్గించి, శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది.

Leave a Reply