fbpx
Menu Close

Recipes

13 . Tomato Pappu ( Tomato Dal)

Tomato Pappu + Avakai ( Mango Pickle)+ Neyyi( Ghee) is a great combination and will make the day. It is one of the most popular way to start the meal in Andhra Style. It is always best to use TurDal ( Kandipappu) to make this Dish.Ingredients needed Tur Dal ( Kandipappu) – One Cup – Pressure Cooked until it is softly boiled.Onion – One – ChoppedTomatoes – Two Large ones…

12. అరటికాయ వడలు: Aratikaya Vada

Aratikaya Vada అరటికాయ వడలు అనేటప్పడికి అమ్మో ఆయిలీ! అని భయపడక్కర్లేదు. తవ్వమీద కొంచం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. కావలసిన పదార్ధాలు: అరటికాయలు 2 , పచ్చి  మిర్చి  2(సన్నగా తరిగినవి) కొత్తిమీర ఒక కట్ట (సన్నగా తరిగినది) ఉప్పు (తగినంత), సెనగపిండి రెండు టీ స్పూన్లు. అరటికాయలు చెక్కు తీసి, మీడియం సైజు ముక్కలుగా కోసి నీళ్ళలో ఉడికించు కోవాలి.  కుక్కర్లో పెడితే మరీ పేస్టూ లాగా అయ్యి బాగుండదు.  బయట స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు పెట్టి సరిపడా ఉదాకించాలి.  చల్లారాక ఉప్పు, సెనగపిండి, సన్నగా తరిగిన మిర్చి, కొత్తిమీర కలిపి వడ లాగా తట్టుకోవాలి. …

23. అరటి కాయ పచ్చడి (కాల్చిన): Aratikaya Chutney

Aratikaya Chutney కావలసిన పదార్థములు: అరటి కాయ     ఒకటి ఎండుమిరప కాయలు ౫ సెనగపప్పు     1 టీ స్పూన్ మినప పప్పు  ఒక టీ స్పూన్ ఆవాలు     అర టీ స్పూన్ ఇంగువ    కొంచం ఉప్పు, చింతపండు, బెల్లం తాయారు చేసే పద్ధతి అరటికాయని గాస్ స్టవ్ చిన్న ఫ్లేం మిద నెమ్మదిగా కాల్చాలి. అరటికాయ మరీ ముదురుగా ఉండ కూడదు.  ఎందు మిర్చి, సెనగ పప్పు, మినపపప్పు, ఆవాలు, ఇంగువ పోపు వేయించి పొడి కొట్టుకోవాలి. ఈ పచ్చడి మిక్సీ లో కంటే చిన్న రోతిగుంటలో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పోపు మరి మెత్తగా కాకుండా బరకగా…

19. పుల్లగా.. కారంగా.. "మామిడి గుత్తివంకాయ కూర- Gutti Vankaya

Gutti Vankaya curry with Mango కావలసిన పదార్థాలు : వంకాయలు… 250 గ్రా. పచ్చి మామిడి… ఒకటి పచ్చిమిర్చి… 30 గ్రా. అల్లం… చిన్న ముక్క జీలకర్ర… అర టీ. వెలుల్లి…10 రేకలు పసుపు… అర టీ. కొత్తిమీర… ఒక కట్ట కరివేపాకు… 2 రెమ్మలు ఉల్లిపాయ… ఒకటి ధనియాలు… ఒక టీ. ఉప్పు… సరిపడా రిఫైండ్ ఆయిల్… సరిపడా తయారీ విధానం : ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిలను రుబ్బుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, రుబ్బి ఉంచుకున్న పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు…

18 .అజీర్ణానికి చెక్ పెట్టే "మెంతి టొమోటో కర్రీ

కావలసిన పదార్థాలు : టొమోటోలు.. పావు కేజీ మెంతికూర.. ఒక కప్పు కొబ్బరికోరు.. ఒక టీఉల్లిపాయ.. ఒకటి కారం.. ఒక టీ. ఉప్పు.. తగినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ. నూనె.. ఒక టీ. ధనియాలపొడి.. ఒక టీ. కరివేపాకు.. రెండు రెబ్బలు కొత్తిమీర.. తగినంత జీలకర్ర, ఆవాలు.. ఒక టీ. తయారీ విధానం : కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు వేయించాలి. శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా వేయించాలి. తరువాత టొమోటో ముక్కల్ని వేసి కలియబెట్టి 5 నిమిషాలపాటు ఉడికించాలి. అందులోనే…

11. చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌ "పన్నీర్ కుర్మా

కావలసిన పదార్థాలు:పన్నీర్… ఒక కప్పుతెల్లగడ్డలు… నాలుగుఅల్లం… రెండు చిన్న ముక్కలుకారం… అర టీస్పూన్గరం మసాలా… ఒక టీ.నెయ్యి… రెండు టీ.ఉల్లిపాయ… ఒకటిపెరుగు… ఒక కప్పుపచ్చిమిర్చి… రెండుధనియాల పొడి… అర టీ.ఉప్పు… తగినంత తయారీ విధానం :ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత దీనికి పెరుగు మిశ్రమాన్ని, ముక్కలుగా చేసుకున్న పన్నీర్‌ను చేర్చి ఐదు నిమిషాలసేపు ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తరువాత కొత్తిమీర తరుగులను చేర్చి దించేయాలి. ఈ కుర్మాను…

10. షుగర్ వ్యాధిగ్రస్తులకు "అరటి కాండం పచ్చడి

 కావలసిన పదార్థాలు :   అరటి కాండం… 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)నిమ్మకాయలు… 15 కాయలుఎండు మిరపకాయలు… 50 గ్రా.ఆవాలు… 50 గ్రా.పెరుగు… 250 మిలీపసుపు… 5 గ్రా.ఉప్పు… 25 గ్రా.కరివేపాకు… సరిపడాపోపుదినుసులు… సరిపడాతయారీ విధానం :  ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.  ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి…