What is there in this Article
Menthi Tomato Curry-Healthy Andhra Curry-మెంతి టొమోటో కర్రీ
Menthi Tomato Curry is a wholesome, traditional Andhra side dish that uniquely blends the herbal goodness of fresh green fenugreek (menthi kura) leaves with the juicy tanginess of ripe tomatoes. Enriched with ginger-garlic, freshly grated coconut, and fragrant coriander powder, this digestive-friendly Menthi Tomato Curry balances subtle bitterness with rich savory flavors, making it a perfect accompaniment for hot steamed rice or warm rotis.
ఆంధ్ర ఇళ్లలో చేసుకునే ఆరోగ్యకరమైన మరుయు రుచికరమైన వంటకాల్లో Menthi Tomato Curry ఒకటి. అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతూ, ఆరోగ్యానికి మేలు చేసే పచ్చి మెంతికూర మరియు పుల్లటి టొమాటోల కలయికతో చేసే ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. అల్లం-వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము మరియు ధనియాల పొడి కలయికతో చేసే ఈ కమ్మని Menthi Tomato Curry తయారీ విధానం తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఇక్కడ చూడండి.
Ingredients (కావాల్సిన పదార్థాలు)
English
-
Tomatoes: 250 grams (Medium ripe, chopped)
-
Fresh Fenugreek Leaves (Menthi Kura): 1 cup (Cleaned and washed)
-
Onion: 1 large (Finely chopped)
-
Grated Coconut: 1 teaspoon
-
Ginger-Garlic Paste: 1 teaspoon
-
Coriander Powder (Dhaniyala Podi): 1 teaspoon
-
Red Chilli Powder: 1 teaspoon (Adjust to taste)
-
Turmeric Powder: 1/2 teaspoon
-
Mustard Seeds (Avalu) & Cumin Seeds (Jeera): 1 teaspoon (Mixed)
-
Curry Leaves: 2 sprigs
-
Fresh Coriander Leaves: A few sprigs (Finely chopped for garnish)
-
Salt: According to taste
-
Cooking Oil: 1 to 2 tablespoons
తెలుగు
-
టొమాటోలు: పావు కేజీ (చిన్న ముక్కలుగా కోసినవి)
-
మెంతికూర: 1 కప్పు (శుభ్రం చేసిన పచ్చి మెంతికూర)
-
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
-
కొబ్బరికోరు: 1 టీస్పూన్
-
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
-
ధనియాల పొడి: 1 టీస్పూన్
-
కారం: 1 టీస్పూన్
-
పసుపు: 1/2 టీస్పూన్
-
ఆవాలు, జీలకర్ర: 1 టీస్పూన్
-
కరివేపాకు: 2 రెబ్బలు
-
కొత్తిమీర: తగినంత (గార్నిష్ కోసం)
-
ఉప్పు: రుచికి సరిపడా
-
నూనె: 1 నుండి 2 టేబుల్ స్పూన్లు
Method of Preparation (తయారీ విధానం)
English
-
Heat oil in a kadai or pan over medium flame. Add mustard seeds and cumin seeds; let them crackle.
-
Add chopped onions and sauté until they turn light golden brown.
-
Add ginger-garlic paste, curry leaves, and turmeric powder one by one. Sauté for half a minute until the raw aroma vanishes.
-
Add the cleaned fresh fenugreek leaves (menthi kura) and fry for 2 minutes until the leaves wilt and loss their raw smell.
-
Add the chopped tomatoes, mix well, cover with a lid, and cook for 5 minutes until tomatoes turn soft and mushy.
-
Add red chilli powder, salt, coriander powder, and grated coconut one after another. Stir well until the mixture thickens into a thick curry consistency.
-
Turn off the flame and garnish with finely chopped fresh coriander leaves.
-
Serve hot Menthi Tomato Curry with steamed rice, phulkas, or rotis.
తెలుగు
-
బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
-
అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి.
-
ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి అర నిమిషంపాటు పచ్చివాసన పోయేలా వేయించాలి.
-
శుభ్రం చేసిన మెంతికూరను కూడా వేసి, పచ్చివాసన పోయేంతదాకా 2 నిమిషాలు వేయించాలి.
-
తరువాత టొమాటో ముక్కల్ని వేసి కలియబెట్టి మూతపెట్టి 5 నిమిషాలపాటు టొమాటోలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-
అందులోనే కారం, ఉప్పు, ధనియాలపొడి, కొబ్బరికోరు ఒకదాని తరువాత ఒకటి వరుసగా వేసి కలియబెట్టాలి.
-
ఈ మిశ్రమం కాస్త ముద్దగా అయి దగ్గరకు పడిన తరువాత దించేసి, చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
-
వేడివేడి Menthi Tomato Curry ని అన్నంలోగానీ, చపాతీల్లోగానీ కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.
Serving Suggestions (వడ్డించే విధానం)
English
-
Tastes amazing when mixed hot into steaming white rice or brown rice with a dash of desi ghee.
-
Serves as an ideal healthy accompaniment for wheat rotis, chapathis, or phulkas.
-
Combines well alongside mild South Indian lentil dishes like Mudda Pappu or Sambar for a balanced meal.
తెలుగు
-
వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ కూర కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
-
గోధుమ రొట్టెలు, చపాతీలు లేదా ఫుల్కాల్లోకి ఇది మంచి కాంబినేషన్‌గా ఉంటుంది.
-
దీనితో పాటు కమ్మని ముద్దపప్పు లేదా సాంబార్‌తో వడ్డిస్తే భోజనం సంపూర్ణమవుతుంది.
Chef’s Pro Tips (ముఖ్యమైన చిట్కాలు)
English
-
Sautéing Fenugreek: Always sauté the fresh fenugreek leaves in oil along with ginger-garlic paste before adding tomatoes; this neutralizes harsh bitterness while extracting its best herbal flavor.
-
Selecting Tomatoes: Use juicy, medium-ripe tomatoes to ensure enough natural gravy forms without needing excess water.
-
Grated Coconut Touch: Adding a touch of grated coconut towards the end beautifully balances the tangy tomatoes and aromatic fenugreek.
తెలుగు
-
మెంతికూర వేయించడం: టొమాటోలు వేయడానికి ముందే మెంతికూరను నూనెలో బాగా వేయిస్తే దానిలోని చేదు గుణం పోయి కూరకి మంచి రుచి వస్తుంది.
-
టొమాటోల ఎంపిక: బాగా పండిన టొమాటోలు వాడితే కూరలో నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా సహజమైన గ్రేవీ వస్తుంది.
-
కొబ్బరి తురుము: చివర్లో వేసే పచ్చి కొబ్బరి తురుము టొమాటో పులుపును, మెంతికూర రుచిని సమతుల్యం చేస్తుంది.
Health Benefits of Menthi Tomato Curry
English
-
Relieves Indigestion: Fenugreek leaves are rich in digestive enzymes and fiber that relieve gastric troubles, acidity, and bloating.
-
Blood Sugar Regulation: Fenugreek contains active compounds that help naturally improve insulin sensitivity and regulate blood glucose levels.
-
Heart & Skin Health: Tomatoes are loaded with lycopene and Vitamin C, which promote healthy cardiovascular function and skin glow.
-
Low-Calorie & High-Nutrient: A nutrient-dense, low-calorie dish suitable for weight management and daily wellness.
తెలుగు
-
అజీర్ణానికి చెక్: మెంతికూరలో ఉండే పీచు పదార్థం మరియు అమైనో ఆమ్లాలు గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
-
షుగర్ నియంత్రణ: మెంతికూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను సహజంగా నియంత్రణలో ఉంచుతుంది.
-
గుండె మరియు చర్మ ఆరోగ్యం: టొమాటోలలో ఉండే లైకోపీన్ మరియు విటమిన్ సి గుండె ఆరోగ్యానికి, చర్మ కాంతికి మేలు చేస్తాయి.
-
బరువు నియంత్రణ: తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది సరైన ఆహారం.
Frequently Asked Questions (FAQ)
English
Q1. Will Menthi Tomato Curry taste bitter?A: No, sautéing the fenugreek leaves in oil beforehand and combining them with tangy tomatoes and grated coconut completely removes any harsh bitterness.
Q2. Can I use Kasuri Methi instead of fresh green fenugreek leaves?A: Fresh green fenugreek leaves offer the best health benefits and texture. However, in an emergency, you can use 2 tablespoons of soaked Kasuri Methi.
Q3. Is Menthi Tomato Curry suitable for diabetics?A: Yes, both fenugreek leaves and tomatoes have a very low glycemic index, making this curry highly recommended for diabetics.
Q4. Do I need to add water while making this curry?A: Generally no, as tomatoes release sufficient natural juice when cooked covered. If you prefer more gravy, you can sprinkle 2-3 tablespoons of warm water.
Q5. How long can this curry be stored?A: It stays fresh for a full day at room temperature and up to 2-3 days when refrigerated in an airtight glass container.
Q6. Can I skip ginger-garlic paste?A: Yes, but ginger-garlic paste enhances digestion and elevates the rich flavor profile of the curry.
తెలుగు
Q1. మెంతి టొమోటో కర్రీ చేదుగా ఉంటుందా?A: ఉండదు! మెంతికూరను నూనెలో వేయించి, పుల్లటి టొమాటోలు మరియు కొబ్బరి తురుముతో కలపడం వల్ల చేదు అసలు తెలియదు.
Q2. పచ్చి మెంతికూర దొరకకపోతే కసూరీ మేథీ వాడొచ్చా?A: పచ్చి మెంతికూరతోనే అసలైన పోషకాలు లభిస్తాయి. అత్యవసరమైతే 2 స్పూన్ల కసూరీ మేథీని నీళ్లలో నానబెట్టి వాడవచ్చు.
Q3. షుగర్ ఉన్నవారు ఈ కూర తినవచ్చా?A: నిరభ్యంతరంగా తినవచ్చు! మెంతికూర మరియు టొమాటో రెండూ బ్లడ్ షుగర్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
Q4. ఈ కూరలో నీళ్లు పోయాల్సిన అవసరం ఉందా?A: అవసరం లేదు. మూతపెట్టి ఉడికిస్తే టొమాటోల నుంచే సహజమైన గ్రేవీ వస్తుంది. కావాలనుకుంటే 2 స్పూన్ల నీళ్లు చిలకరించుకోవచ్చు.
Q5. ఈ కూర ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది?A: బయట ఉంచితే ఒక రోజు, ఫ్రిజ్‌లో పెడితే 2 నుండి 3 రోజుల వరకు తాజాగా ఉంటుంది.
Q6. అల్లం-వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేయవచ్చా?A: చేయవచ్చు, కానీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేస్తే జీర్ణక్రియకు మంచిది మరియు కూర రుచి మరింత పెరుగుతుంది.
You Can Also Try These Recipes
Explore more authentic South Indian recipes on our blog:
- 88. Beerakaya Menthi Kura Pesara Pappu Curry-Healthy Andhra Curry-బీరకాయ మెంతి కూర పెసరపప్పు
- 02. Crispy Methi Poori Recipe (Fenugreek Puri)
- 01. Crispy Palak Poori Recipe (Spinach Puri)
- 88. Beerakaya Menthi Kura Pesara Pappu Curry-Healthy Andhra Curry-బీరకాయ మెంతి కూర పెసరపప్పు
- 04. Aloo Methi Paratha Recipe (Potato Fenugreek Paratha)
Support Our Channel and Website
Your support helps us bring authentic traditional recipes and culinary heritage freely to everyone:
- International Contributions (PayPal): https://www.paypal.com/paypalme/rpbehara
- India Contributions (UPI ID): speakingdata@ybl
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.
Absolutely with you it agree. In it something is also to me it seems it is excellent thought. Completely with you I will agree.
I consider, that you have misled.
It has surprised me.